Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్దూరు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

మద్దూరు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మద్దూరు
మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇందిరమ్మ ఇండ్లను సిద్ధిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆస్పత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూసుకోవాలన్నారు. ఆస్పత్రి రిపేర్ పనులను త్వరగా పూర్తి చేయాలని పి.ఆర్.ఏ.ఈ ని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని ఆమె కోరారు. ఆమె వెంట స్పెషల్ ఆఫీసర్ రాధిక, తహసిల్దార్ ఏజి రహీం, ఎంపీడీవో రామ్మోహన్ ,డాక్టర్ రజిత, ఎంపీఓ గద్ద వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఏఈ చిన్ను సహని, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -