Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మలబార్ లో ఆర్టిస్ట్రీ షో ప్రారంభం

మలబార్ లో ఆర్టిస్ట్రీ షో ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
మలబార్ లో ఆర్టిస్ట్రీ షో, వినియోగదారులకు అనువైనది అని ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిమరాజ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ లో గల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ఆర్టిస్ట్రీ షో ను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మాజీ ఇంచార్జ్ సూపరింటెండెంట్ , ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిమరాజ్ శుక్రవారం షో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో నాణ్యతతో మన్నికగా లభిస్తాయి అని, వినియోగదారుల అనుకూలత కొరకై ప్రత్యేకంగా ఆర్టిస్ట్రీ షో ను ఈనెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తారు అని అన్నారు.

అందులో ప్రతి కొనుగోలు పై ప్రత్యేక ఆఫర్లను పొందండి అని, బంగారు ఆభరణాల, రత్నాభరణాల తరుగు చార్జీలపై ఫ్లాట్ 30% తగ్గింపు, వజ్రాభరణాల వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు పొందండి అని వివరించారు. వినియోగదారులకు న్యాయమైన వాగ్దానాలు ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు , ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరలు, 100%  బి.ఐ. ఎస్ హాల్ మార్కుతో ధృవీకరించబడిన స్వచ్ఛమైన హెచ్యుఐడి బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ అక్షయ్, స్టోర్ మేనేజర్ ప్రశాంత్, వినియోదారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -