ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్రమౌళి
నవతెలంగాణ – భూపాలపల్లి
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్రమౌళి కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన వికలాంగుల జిల్లా సదస్సుకు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి రుద్రరాపు రామచందర్, విహెచ్పిఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ అబ్బోరి వినోద్ రెడ్డి లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పారని విమర్శించారు. వికలాంగులకు 6000 .వితంతువులకు వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని రిజర్వేషన్లు నాలుగు శాతం రాజకీయంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వికలాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే ఈనెల 25న
భూపాలపల్లి జిల్లాకు మంద మందకృష్ణ మాదిగ పర్యటన ఉంటుందన్నారు. జిల్లా ఇన్చార్జి రుద్రారపు రామచందర్ మాట్లాడుతూ… మందకృష్ణ మాదిగ రానున్న తరుణంలో గ్రామాల్లోని వికలాంగులు వితంతువులు వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యల పైన పోరాటానికి మరో మారు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను మోసం చేయటం లో మొదటి అడుగులో వుందని మ్యానిఫెస్టోలో పెట్టినా హామి ఇంత వరకూ అమలు చేయక పోవడం చాలా హీనమైన చర్య అన్నారు. దివ్యంగులకు ఇచ్చిన మాట కూడా నిలపెట్టుకోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వికలాంగులకు న్యాయం చేయాలన్నారు.
వి ఎచ్ పి ఎస్ .జిల్లా ఇన్చార్జి వినోద్ రెడ్డి మాట్లాడుతూ… జిల్లాలోని వికలాంగులు వృద్ధులు వితంతువులకు అండగా ఎమ్మార్పీఎస్ శ్రేణులు మన కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించి మరో మారు మన వెను వెంట ఉండటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జిల్లాలోని వికలాంగుల సమాజం పెద్ద మొత్తంలో భూపాలపల్లి నీ చుట్టు ముట్టేలా. తరలిరావాలని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వి ఎచ్ పి యస్ జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశి క్రిష్ణ గౌడ, ఎం ఎస్ పి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొల్లి బాబు, నోముల శ్రీనివాస్, గాజుల భిక్షపతి, కేసారపు నరేష్, దుర్గం శంకరయ్య, పంచిక కుమార్ యాదవ్, మంద తిరుపతి,ఆయా మండలాల అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.