నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ కగార్ నిలిపి వేసి, చర్చలకు తాము సిద్దమని మావోయిష్టులు ప్రకటించినా.. మొండిపట్టుదలతో దండకారణ్యంలో బీజేపీ ప్రభుత్వాలు మారణోమం సృష్టిస్తున్నాయి. వేలమంది మావోయిష్టులను ఎన్‌కౌంటర్ పేరుతో హతం చేస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
అబుజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీస్ అధికారులు చెప్పారు.ఈ ఘటన తర్వాత, ఆ ప్రాంతంలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఏకే-47/ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను , నిత్యావసర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నట్లు చెప్పారు.