నవతెలంగాణ – ముధోల్
ముధోల్ నియోజకవర్గం నుండి అత్యదిక సార్లు ఎమ్మెల్యే గా గెలిపొందిన దివంగత మాజీ మంత్రి గడ్డి గారి గడ్డెన్న ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. తాజాగా రానున్న ఎన్నికల్లో వారి మనమడు రాజకీయంలోకీ రానున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి గడ్డెన్న మనమడు యువ న్యాయవాది విజయ భాస్కర్ రెడ్డి ముధోల్ జడ్పిటిసి బరిలో ఉంటారన్న ప్రచారం రాజకీయం లో హాట్ టాపిక్ గా మారటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ముధోల్ నియోజకవర్గం లో మాజీ మంత్రి గడ్డెన్న ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోని, అందరు కాకా గా పిలుస్తుంటే వారు. అయితే వారి కుమారుడు న్యాయవాది విఠల్ రెడ్డి రెండు సార్లు ముధోల్ ఎమ్మెల్యే గా గెలిపొందాడు.
గత ఎన్నికల్లో ఓటమి చెందారు. తన మాతృ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ చక్రం తిప్పుతున్నాడు. అయితే ముధోల్ నియోజకవర్గం లో బిజేపి ఎమ్మెల్యే ఉండటంతో పాటు, బలంగా పార్టీ విస్తరించి ఉంది. ఎలాగైనా రానున్న జెడ్పిటిసి, ఎంపిటిసి, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోవాలన్న ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఇప్పటి నుండి అనుకూలంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ సర్కిల్లో ప్రచారం ఊపు అందుకుంది .ముధోల్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బలమైన నాయకుడు లేరన్న విమర్శల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి తన తమ్ముడు కుమారుడు యువ న్యాయవాది విజయభాస్కర్ రెడ్డి ని రిజర్వేషన్ అనుకూలిస్తే జెడ్పిటిసి బరిలో నిలపడానికి ముందుకు వచ్చినట్లు మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముధోల్ నుంచి జడ్పిటిసి గెలిస్తే రిజర్వేషన్ అనుకూలిస్తే నిర్మల్ జెడ్పి చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ నుండి దక్కించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఎత్తు గడ వేసినట్లు పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
గత నాలుగు ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పోటీ చేసినప్పుడు నామినేషన్ నుండి ఆర్థిక వనరుల వరకు భాస్కర్ రెడ్డి చూసుకునే విషయం నియోజకవర్గం నాయకులకు తెలిసిన విషయమే. అయితే ఎలాగైనా రానున్న ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం లో బిజెపి కి చెక్ పెట్టడానికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చాప కింద నీరులా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అన్ని అనుకూలిస్తే తమ తమ్ముడు కుమారుడిని కాంగ్రెస్ పార్టీ నుండి జెడ్పిటిసిగా బరిలో నిలిపేందుకు మాజీ ఎమ్మెల్యే సుముఖత వ్యక్తం చేసినట్లు స్థానికంగా గత రెండు, మూడు ,రోజుల నుంచి చర్చ కొనసాగుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే చివరి వరకు తన రాజకీయ ఎత్తుగడలు ఎవరికి అంతుపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారన్నా ప్రచారం లేకపోలేదు. గతంలో మాజీ మంత్రి గడ్డెన్న కూడా తన రాజకీయ వారసుడిని తెరమీదకి తేలేదు. మాజీ మంత్రి గడ్డెన్న వారసుడు గా కుమారుడు విఠల్ రేడ్డి స్వయంగా తెరమీదకి వచ్చారు. అయితే రానున్న జెడ్పిటిసి ఎన్నికల్లో తన తమ్ముడు కుమారుడిని రాజీకీయంలోకి తెస్తారో లేదో అనే విషయం ఆసక్తికరంగా మారింది.ఏది ఏమైనా యువ న్యాయవాది జెడ్పిటిసి బరిలో ఉంటారో లేదో అనేది వేచి చూడాలి మరి..!