కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘సుమతీ శతకం’. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్నారు. వింటేజ్ విలేజ్ డ్రామా, లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని దర్శకుడు ఎం.ఎం.నాయుడు తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ సయాలీ పాత్రకు సంబంధించిన లుక్‌ని రివీల్ చేశారు.
ఆహ్లాదకరంగా ఉన్న సయాలీ పోస్టర్ అందర్నీ అలరిస్తోంది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేసి సినిమాపై మరింత అంచనాల్ని పెంచాలని మేకర్లు భావిస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టే సినిమా ఉంటుందని నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ తెలిపారు. దసరా కానుకగా విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని అన్నారు.
దర్శకుడు ఎం.ఎం.నాయుడు మాట్లాడుతూ, ‘ఇప్పుడొస్తున్న సినిమాలతో పోలిస్తే మా సినిమాలోని కథాకథనాలు చాలా భిన్నంగా ఉంటాయి. సరికొత్తగా ‘సుమతీ శతకం’ ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. ముఖ్యంగా నాయకానాయికల పాత్రలు ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి. మంచి కంటెంట్‌తో సినిమా ఉంటే దాన్ని ప్రేక్షకులు హిట్ చేయటం ఖాయం. ఆ కోవలోనే ఉన్న మా చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని తెలిపారు.
ఈ చిత్రంలో టేస్టీ తేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా సుభాష్ ఆనంద్, డైలాగ్ రైటర్‌గా బండారు నాయుడు, ఎడిటర్‌గా నాహిద్ మొహమ్మద్, డీఓపీగా హాలేష్ పని చేస్తున్నారు.
సరికొత్తగా ‘సుమతీ శతకం’
- Advertisement -
- Advertisement -