ముమ్మాటికి నాది
హంతక భాషే
భావాన్ని పట్టే భాష
నీవే గమనించవ్
నాకు అధికారమదం ఉంది
నాకే నాపట్ల
జుగుప్స అసహ్యం
నా కండకావరం నాదే
కగార్ కావచ్చు బీహార్ కావచ్చు
అస్థిత్వ ప్రాణాంతకాల్లో
నలిగే విపీలికాలతో
నాకేం పని?
మహాత్మ హంతక చరిత్రలో
రక్తమోడే నాకపాణం
చూడకపోవడం నీ ఖర్మ
నచ్చని వారి హత్యే నా పని
బుల్లెట్టా ? ఓటా?
ఏది లాభమో గదే చేస్తా
శాంతి – సామరస్యం
నా డిక్షనరీలో ఎందుకుంటారు ?
నేనో హంతక ముఠా
ఖామోష్ ! బరితెగించా!
నా ఆలోచనల్లో
నిన్ను పడేస్తా
పడకపోతే కసికొద్దీ చంపేస్తా
అదే నా ధర్మం.
హా. హా.. హా..
నా వ్యూహం నీవు పసిగట్టలేవ్
ప్రజాస్వామ్యం అని గీ పెడ్తావ్
సోషలిజం సెక్యులరిజం
మనవి కావని చెప్తే వినవేం?
నాకు నేను సష్టం – నీవే అస్పష్టం
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా !
నాది హంతక భాషే…
– కె.శాంతారావు
9959745723
హంతక భాష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES