Saturday, July 19, 2025
E-PAPER
Homeబీజినెస్భారత్‌ నుంచి తరలిన 5 బిలియన్ల పెట్టుబడులు

భారత్‌ నుంచి తరలిన 5 బిలియన్ల పెట్టుబడులు

- Advertisement -

– జూన్‌లో రెట్టింపు
న్యూఢిల్లీ :
పెట్టుబడిదారులకు భారత ఆర్థిక వ్యవస్థ ఆకర్షణీయంగా కనబడుతున్నట్లు లేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు విదేశాల్లో పెట్టుబడులకు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు భారత్‌ నుంచి బయటకు వెళ్లిన ఎఫ్‌డిఐల గణంకాలే నిదర్శనం. ప్రస్తుత ఏడాది జూన్‌లో బయటికి తరలిపోయిన ఎఫ్‌డీఐలు 5.03 బిలియన్‌ డాలర్లకు చేరింది. గతేడాది ఇదే నెలలో ఈ మొత్తం 2.9 బిలియన్‌ డాలర్లతో పోల్చితే దాదాపు 74 శాతం పెరుగుదల చోటు చేసుకుందని స్వయంగా ఆర్‌బిఐ గణంకాలే స్పష్టం చేస్తున్నాయి. విదేశాలకు తరలిపోయిన వాటిలో ఈక్విటీ పెట్టుబడులు 2.04 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇవి గతేడాది ఇదే నెలలోని 670.7 మిలియన్‌ డాలర్లతో పోల్చితే మూడు రెట్ల పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌ కాలంలో విదేశాలకు తరలిపోయిన పెట్టుబడులు 6.64 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో 4.3 బిలియన్‌ పెట్టుబడులు తరలిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -