నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణకు బిగ్ అలర్ట్..తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు రాష్ట్రానికి వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇవాళ కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక అటు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. నగరాన్ని వర్షం ముంచెత్తింది. రహదారులు, ఫ్లైఓవర్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడే స్తంభించిపోయిన ట్రాఫిక్, గంటలకొద్దీ నరకయాతన అనుభవిస్తున్నారు వాహనదారులు. కంటోన్మెంట్, బోయిన్పల్లిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. పలు చోట్ల నేలకొరిగాయి చెట్లు. గోడలు కుప్పకూలిపోయాయి.