నవతెలంగాణ – నిజాంసాగర్
మహిళలు పనిచేసే స్థలాలలో లైంగిక వేధింపులకు గురికాకుండా రక్షణ కల్పించే ఉద్దేశంతో పోఓఎస్ హెచ్ చట్టం ప్రకారం అంతర్గత కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని మండల వైద్య అధికారి డాక్టర్ రోహిత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని ప్రదేశంలో మహిళల లైంగిక వేధింపుల నివారణకు ఈ కమిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పని ప్రదేశాలలో మహిళలకు భద్రత మరియు గౌరవం కల్పించడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా లింగ నిపుణురాలు తులసి మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులకు, వారి హక్కులపై అవగాహన కల్పించారు. ఉద్యోగులందరూ చట్టాల ప్రాముఖ్యతను అర్థం చేసుకొని భద్రతతో కూడిన పని వాతావరణం కోసం కట్టుబడి ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
పోష్ చట్టంపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



