Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బోనాలు పండగ ప్రకృతికి కృతజ్ఞత 

బోనాలు పండగ ప్రకృతికి కృతజ్ఞత 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
బోనాలు పండగ అంటే ప్రకృతికి కృతజ్ఞత తెలుపడం అని, ఎటువంటి క్షామాలు తలెత్త కుండా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవడమే ఈ పండగ పరమార్థమని  నిజామాబాద్ రూరల్ మండల  విద్యాశాఖ అధికారి సేవుల అన్నారు. సారంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బోనాలు పండుగకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాలు తెలంగాణ రాష్ట్ర అధికార పండగని, పండగ విశేషాలను విద్యార్థులకు తెలియజేయడానికి ఇటువంటి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్ల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి పట్ల సమాజంలో అవగాహన కలిగించడం ఆ పరంపరను తరతరాలకు అందించడానికి దోహదపడుతుందని అన్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు, కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ  హైదరాబాదులో, తెలంగాణలో ప్లేగు వంటి వ్యాధులు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు రక్షణ కోరుతూ పెద్దమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ  పోచమ్మ వంటి గ్రామ దేవతలను పూజించేవారని అప్పటినుంచి సంప్రదాయబద్ధంగా ఈ పండగ కొనసాగుతుందని 600 ఏళ్ళుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తుందని తెలిపారు బోనం అంటే భోజనం అని బెల్లం అన్నం సమర్పించి అమ్మవారిని కాపాడమని కోరుకుంటారని పండగ గొప్పతనాన్ని ఆయన వివరించారు. 

సారంగాపూర్ గ్రామ పెద్దలు, విద్యార్థులు,  ఉపాధ్యాయులు,  గ్రామస్తులు బోనాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి గోపాల్, జావిద్, విద్యాసాగర్, డాక్టర్ గంగాధర్, ఘనపురం దేవేందర్, కృష్ణంరాజు, స్వరూప, సుజాత, అనిత, లలిత, శ్రీలత , అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు ఉజ్వల, గ్రామ పెద్దలు హనుమంతు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్, వేముల రవి,  ఆంజనేయులు, నెహ్రూ నగర్ మాజీ సర్పంచ్ అమానుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -