- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గత నెలలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక రానుంది. ఈ ఉప ఎన్నికలో గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని అన్నారు. అంతకుముందు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మురళీ గౌడ్, సంజయ్ గౌడ్ పార్టీలో చేరగా, వారికి మహేశ్ కుమార్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
- Advertisement -