Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనంతారంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే...

అనంతారంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం అనంతారం గ్రామంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.  హెచ్‌ఎండీఏ నిధులతోరూ.40లక్షలతో, అంగన్వాడి బిల్డింగ్ రూ.12లక్షల తో, ఎస్సీ సబ్ ప్లాన్ రూ.5 లక్షలతో, డిఎంఎఫ్  రూ.5లక్షలతో, ఆర్డబ్ల్యూఎస్  రూ.2లక్షలతో, ఇ.జి.ఎస్ రూ.10లక్షలతో పలు అభివ్రుద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పకీరు కొండల్ రెడ్డి, ఎర్ర శ్రీరాములు, విట్టల్ వెంకటేష్, సల్ల పండు, చిగురు పెళ్లి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు ఎలిమిటి కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంతో పాటు తాజ్పూరు, హనుమాపురం, ముత్తిరెడ్డిగూడెం, గంగసానిపల్లి, గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -