Sunday, July 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసామ్రాజ్య వాదానికి మోడీ పెద్ద బానిస

సామ్రాజ్య వాదానికి మోడీ పెద్ద బానిస

- Advertisement -

– అమెరికా ఆంక్షలకు జీ హుజూర్
– ట్రంప్, మోడీ విధానాలతో దేశ ప్రజలకు ప్రమాద ఘంటికలు
– కార్మిక వర్గాన్ని బానిసల్ని చేయడం కోసమే 4 లేబర్ కోడ్ లు
– బీజేపీ మంత్రతంత్రం మతమే
– కనీస వేతనాలు పట్టిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– దోపిడీకి వ్యతిరేకంగా వర్గ పోరాటాలే పరిష్కారం
– మోడీ విధానాల పై మరిన్ని ప్రతిఘటన పోరాటాలు
– కార్మికోద్యమాలకు పుట్టినిల్లు మెతుకు సీమ మెదక్
– రాష్ట్ర 5వ, మహాసభల జయప్రదం కోసం ఆహ్వాన సంఘం ఏర్పాటు
– చైర్మన్ గా చుక్క రాములు, ప్రధాన కార్యదర్శిగా ఎ. మల్లేషం
– మహాసభల జయప్రదం కోసం భారీ విరాళాల అందజేసిన వేతన జీవులు
-ముఖ్య అతిదిగా హాజరైన సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం. సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

“అమెరికా అధ్యక్షులు ట్రంప్ పెడుతున్న ఆంక్షలను తూచా తప్పకుండా అమలు చేస్తామని జీ హుజూర్ అంటున్న ప్రధాని మోడీ సామ్రాజ్యవాదానికి అతి పెద్ద బానిసగా వ్యవహరిస్తున్నాడు. ట్రంపు మోడీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు దేశ ప్రజలకు ప్రమాదగంటికలుగా మారుతున్నాయి. కార్మిక వర్గాన్ని బానిసల్ని చేయడం కోసమే మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ ల ను అమలు చేస్తుంది. డబల్ ఇంజన్ సర్కార్లతో పాటు విపక్ష రాష్ట్ర ప్రభుత్వాల సైతం తలుపుతూ లేబర్ కోట్లు అమలు చేసేందుకు పని గంటలు పెంచుతూ జీవోలు జారీ చేస్తున్నాయి. బిజెపి మంత్ర తంత్రంగా మతాన్ని వాడుతూ ప్రజలు కార్మికుల్ని సబ్మిటితం కాకుండా చీలికలు పేలికలు చేస్తూ పాలిస్తుంది.

కార్మికుల ఆర్థిక సామాజిక స్థితిగతులను పట్టి కనీస వేతనాలు నిర్ణయించాల్సిన ఇండియన్ లేబర్ కాంగ్రెస్ను ఏ వీరియం చేసిన మోడీ ప్రభుత్వం పదేళ్లుగా కనీస వేతనాలు పెంచేందుకు కమిటీలు వేయలేదు రాష్ట్రంలోని 10 ఏళ్ల టిఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం లో కూడా కనీస వేతనాలు పెంచకుండా కార్మికులకు ద్రోహం చేస్తున్నాయి. మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన పోరాటాలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలోని కార్మిక సంఘాలను సంఘటితం చేస్తూ కార్మికు ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తున్న సిఐటియు సంసాగత మహాసభలను జరుపుకోబోతుంది. సరళీకృత ఆర్థిక విధానాలు చూపలేని పరిష్కారాలను సోషలిజం మాత్రమే చూపగలుగుతుందని విశ్వసిస్తున్న సిఐటియు రాబోయే కాలంలో వర్గ పోరాటాలకు మరింత పదును పెట్టేందుకు సిద్ధమవుతుందని సిఐటియు అఖిలభారత కోశాధికారి ఎన్ సాయిబాబు స్పష్టం చేశారు.

ఈ ఏడాది డిసెంబర్ 7-9 తేదీలో సీఐటీయూ రాష్ట్ర 5వ, మహాసభలు మెదక్ జిల్లా కేంద్రంలో జరగనున్నాయి. ఈ మాసవుల నిర్వహణ కోసం శనివారం మెదక్ పట్టణంలోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం నిర్వహించారు ఈ సమావేశంలో ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ప్రధాన కార్యదర్శిగా మెదక్ జిల్లా కార్యదర్శి కోశాధికారిగా బి బాలమణి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ కోశాధికారి ఏం సాయిబాబా మాట్లాడుతూ కార్మిక పోరాటాలకు శక్తిని, ఆక్సిజన్, సత్తువను ఇచ్చే ఉమ్మడి మెదక్ జిల్లా ఐదవ రాష్ట్ర మహాసభలకు అతిద్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సిఐటియు అంటే ఒక సంఘం కాదని దేశంలోని అన్ని కార్మిక సంఘాల్ని సంఘటన చేసే శక్తి అని ఆయన పేర్కొన్నారు.

గత మూడేళ్ల కాలంలో ప్రజలు, కార్మికుల ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏమిటి అనేది మాహాసభల్లో చర్చించి పోరాట కర్తవ్యాలు నిర్దేశించుకుంటామని అన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి 11 నెలల పాలనలో రాష్ట్రంలో అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో కార్మిక హక్కులు హరించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారత్ ను 5వ స్థానంలో నిలబెడతామని గత ఎన్నికల ముందు బిజెపిను బలపరుస్తూ జపాన్ ను వెనక్కు నెట్టి నాలుగో స్థానానికి పెరిగామని గొప్పలు చెబుతుందన్నారు. జనాభాలు రెండవ స్థానం ఆర్థిక రంగంలో నాలుగో స్థానం ఉందని గొప్పలు చెప్పుకునే దేశంలో మెజార్టీ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఎందుకు మెరుగుపడలేదని ఆయన ప్రశ్నించారు. ఈ దేశంలోని 50 కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలు ఎందుకు పెరగలేదని నిలదీశారు. 16 ఏళ్ల క్రితం నిర్ణయించిన 30 లక్షల మంది మధ్యాహ్న భోజన కార్మికుల నేలవేతనం ఇప్పటికి ₹1000 మాత్రమే ఇస్తున్నారు అంటే గొప్పలు చెప్పుకునే ఆర్థిక పురోగమితి ఎవరికి ఉపయోగపడిందని ఆయన ద్వజమెత్తారు.

సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మికుల ఆర్థిక సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసి కనీస వేతనాలు నిర్ణయించాల్సిన ఇండియన్ లేబర్ కాంగ్రెస్ ఉనికి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మోడీ 11 ఏళ్ల పాలనలో కనీస వేతనాలు నిర్ణయించేందుకు కనీసం ఏ ఒక్క కమిటీనీ కూడా నియమించలేదంటే కార్మిక వర్గానికి ఆయన చేస్తున్న ద్రోహం ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని కార్మిక సంఘాల డిమాండ్ చేస్తూ లేక పోరాటాలు నడిపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోని దుస్థితి నెలకొంది అన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అరించడమే కాకుండా కరుణాకర్ కాలములో 29 కార్మిక చట్టాలను మారుస్తూ నాలుగు లేబర్ పౌర్ణమి తీసుకురావడం దుర్మార్గమైన చర్య అన్నారు. పెట్టుబడుదారుల దోపిడీకి ఉపయోగపడుతూ.. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేయాలనే దురుద్దేశంతోనే మోడీ నాలుగు లేబర్ కోళ్లను అమలు చేస్తున్నారని విమర్శించారు.

పైగా రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇచ్చే సంస్థను అమలు చేయాలని అంశాలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాలను అప్పుల కోసం బిచ్చగాళ్ల వల్లే అడుక్కుతినే పరిస్థితిని బిజెపి సృష్టించింది అన్నారు. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు పెట్టాలని తీసి సంస్కరణలను 10 గంటల పని విధానాన్ని పెంచాలని ఒత్తిడి చేయడం వల్ల ఇటీవల ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు 10 గంటల పని పెంచుతూ కార్మిక వర్గాన్ని కుంగదీసేలా జీవోలను జారీ చేశాయని గుర్తు చేశారు. ఒకప్పుడు ఒక వస్తువు తయారీ విలువలో 30 శాతం కార్మికుల వేతనానికి కేటాయించగా ప్రస్తుతం 7 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 11 ఏళ్లుగా కనీస వేతనాలజీవోను సవరించపోవడం వల్ల కార్మికుల శ్రమ దోపిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. దేశాన్ని పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతూ తమ పరిపాలన పగ్గాలను కాపాడుకోవడం కోసం బిజెపి మతం అనే మంచతంత్రాన్ని ఉపయోగిస్తుందన్నారు.

దేశ ప్రజలు కార్మికులు రైతులు గ్రామీణ పేదలు మహిళలు యువకులు విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయకుండా వారిని మతం పేరుట విభజిస్తూ తమ పబ్బం కడుక్కునేలా బిజెపి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని తీరం రా విమర్శించారు. సమాజంలో మనుషులందరూ సమానమేనని చెబుతున్న రాజ్యాంగ స్ఫూర్తికి తూర్పు పొడుస్తూ కులాలు వర్ణాలు మతాలు ఉండి తీరాలని శాసించే మనస్ఫూర్తిని అమలు చేయాలని బిజెపి తహతహలాడుతుందని పేర్కొన్నారు. ఒకే దేశం ఒకే చట్టం ఒకే ఎన్నిక ఒకే పన్ను అంటూనే ప్రజల్ని మాత్రం మతం కులం ప్రాంతం రంగు భాష పేరుట విభజించి పాలించడం బిజెపికి అలవాటుగా మారిందన్నారు. బిహారి ఎన్నికలు లబ్ధి పొందాలని ఓటర్ లిస్టులో సవరణ పేరుతో డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆంక్షలు పెట్టడం దూరంగా ఉందన్నారు.

ఈ దేశ పౌళ్లను రుజువు చేయడం కోసం పుట్టిన తేదిస్తే పత్రాలను సమర్పించుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. సరే నీకు తాధిక విధానాలు నిరుద్యోగం తరల పెరుగుదల వ్యవసాయ సంక్షోభం పేదరికం సామాజిక వివక్షతలకు పరిష్కారం చూపు లేకపోయాయని ఆయన. మెరుగైన సమాజ నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ విధానాలు కలిగిన సోషల్ జమే పరిష్కారం అని ఆయన స్పష్టం చేశారు. దోపిడి నిర్మూలన కోసం సమ సమాజ స్థాపన కోసం కార్మిక పోరాటాలే పరిష్కారమని అన్నారు. విశాఖపట్నంలో జరిగే సిఐటియు జాతీయ మహాసభల్లో దేశ ప్రజలు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక స్థితిగతులను చర్చించడంతోపాటు రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతిఘటన పోరాటాలను తీరా తరం చేసేందుకు కర్తవ్యాలను ఉద్దేశించుకుంటామని ఆయన పేర్కొన్నారు.


కార్మికులకు అండ సిఐటియు జెండా: సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
జెండాలు ఎన్ని ఉన్నా కార్మిక వర్గానికి సిఐటియు జెండా మాత్రమే అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ స్పష్టం చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ముందుండి పోరాడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 700 యూనియన్లకు పైగా సిఐటి అనుబంధంగా పనిచేస్తున్నాయని చైతన్యవంతమైన కార్మిక వర్గంగా నిలుస్తుందన్నారు. మెదక్ పట్టణంలో నిర్వహించే రాష్ట్ర ఐదవ మహాసభల్లో కార్మిక వర్గ స్థితిగతులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమగ్రమైన చర్చ జరిపి భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకుంటామని ఆయన పేర్కొన్నారు మాసభలు జయప్రదం కోసం కార్మిక వర్గం హితోరికంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


శ్రమ దోపిడీ పోవాలి..శ్రామికులే పాలకులవ్వాలి :చుక్క రాములు
“శ్రమ దోపిడీ పోవాలి… శ్రామికులే పాలకులవ్వాలి” అనే నినాదంతో సమసమాజ స్థాపన కోసం ఎర్రజెండా నీడన కార్మిక పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న సిఐటియూ 50 ఏళ్లుగా చంద్రశేఖర్ పోరాటాలను నిర్వహిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు ఆహ్వాన సంఘం చైర్మన్ చుక్క రాములు అన్నారు. సిఐటియు జీతభత్యాల పోరాటలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం, కరువు వల్ల ఆకలితో అల్లాడిన ప్రజలకు అంబలి కేంద్రాలు పెట్టి, పశుగ్రాసం పంచి అండగా నిలిచిన చరిత్ర సీఐటీయూ కు ఉందని అన్నారు. రాష్ట్రంలో అప్పులు ఉన్నది 18 వేల కోట్ల ఆదాయం మాత్రమే ఉందన్న విషయం రేవంత్ రెడ్డికి తెలవదా అని ఆయన ప్రశ్నించారు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాలని కోరుతుంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికుల కనీస వేతనాలు పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టంగా లేవన్నారు. ప్రజా పోరాటాలకు నాంధి పలుకుతున్న మెతుకు సీమ మెదక్ సిఐటియు రాష్ట్ర ఐదో మహాసభలకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మాసకుల జయప్రదం కోసం భారీగా విరాళాలు అందజేసి సహకరించాలని ప్రజలను కోరారు.

పోరాటాలను తీవ్ర తరం చేయడం ద్వారానే కార్మిక వర్గం ఐక్యత సాధ్యం: ఆర్. సుదాభాస్కర్
పోరాటాలని తీవ్రతరం చేయడం ద్వారానే కార్మిక వర్గాన్ని సంఘటతం చేయగలరని సిఐటి సీనియర్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. సుధా భాస్కర్ స్పష్టం చేశారు. కులం, మతం, ప్రాంతం పేరుట కార్మికుల్ని విభజించి పోరాటంలోకి రాకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో 40 ఏళ్ల క్రితం ఒక ఫ్యాక్టరీలో మొదలైన సిఐటియు ప్రస్థానం రాష్ట్ర మహాసభలు నిర్వహించే శక్తిగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా సంఘాల నాయకులు బి. మల్లేశం, జీ సాయిలు, కే. రాజయ్య, జయరాజు, మాణిక్యం, మల్లారెడ్డి, గోపాల స్వామి, ఎల్లయ్య, భాస్కర్, బాలమణి, నర్సమ్మ, కే. మహేందర్ రెడ్డి, మల్లేషం, నాగరాజు, సంతోష్, కృష్ణ, పాండురంగారెడ్డి, భాగారెడ్డి, బండ్ల స్వామి, టీఎన్జీ ఓ రాష్ట్ర నాయకులు నరేందర్, రాజకుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -