Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వయోవృద్ధుల చట్టం గురించి తెలుసుకోవాలి

వయోవృద్ధుల చట్టం గురించి తెలుసుకోవాలి

- Advertisement -

పరకాల ఆర్డిఓ డాక్టర్ కే. నారాయణ
నవతెలంగాణ – పరకాల 

వయోవృద్ధుల వివిధ రకాల అవసరాలు తీర్చేందుకు భారత ప్రభుత్వం తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం 2007, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2011 చట్టాల చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని  పరకాల ఆర్డిఓ డాక్టర్ కె నారాయణ అన్నారు. గురువారం ఆర్డిఓ కార్యాలయంలో వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై వయోవృద్ధుల సంక్షేమ సంఘం పరకాల అధ్యక్షులు రేపాల నరసింహారాములు అధ్యక్షతన చర్చ గోష్టి నిర్వహించడం జరిగింది. 

పరకాల, హనుమకొండ(విద్యారణ్యపురి)వయోవృద్ధుల సంక్షేమ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాట్లాడుతూ భారతదేశం అమలులోకి తీసుకొచ్చిన 2007 వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టంతో పాటు వయోవృద్ధుల ప్రాణానికి, ఆస్తులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం నియమావళి 2011   చట్టబద్ధత కలిగిన ఈ చట్టం నియమావళి ప్రకారం తల్లిదండ్రులు వయోవృద్ధుల ప్రాణానికి ఆస్తులకు సంరక్షణ, పోషణతో పాటు భరణం అడిగే హక్కు కల్పిస్తుందన్నారు.

ఈ చట్టం అమలుచేయుటలో భాగంగా ఆర్డిఓ ఆధ్వర్యంలో పరకాల వయోవృద్ధుల సంక్షేమ సంస్థకు చెందిన ముగ్గురు సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పడిందని, దీని ద్వారా పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన వయోవృద్ధుల నుండి  స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి వయోవృద్ధులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నుండి ఇప్పటివరకు 26 కేసులు పరిష్కరించబడ్డాయని, మరో 24 కేసులు విడతలవారీగా పరిష్కరిస్తున్నామని ఆయన వివరించారు. ప్రతి బుధ, శని వారాల్లో ఫిర్యాదులు స్వీకరిస్తూ వారి పిల్లలకు నోటీసులు పంపి కౌన్సిలింగు ద్వారా తీర్పులు ఇవ్వబడుతున్నాయన్నారు.

ఈ సమావేశానికి అతిథిగా విచ్చేసిన వయోవృద్ధుల సంక్షేమ సంస్థ విద్యారణ్యపురి హనుమకొండ  అధ్యక్షులు, విశ్రాంత డిఎస్పి దామెర నర్సయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం అందరూ సద్వినియోగపరచుకోవాలన్నారు. వృద్ధులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి ఆయన వివరించారు. పరకాల ఐసిడిఎస్ సిడిపిఓ స్వాతి మాట్లాడుతూ తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007 గురించి వివిధ గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

ఈ సమావేశంలో హనుమకొండ సంస్థ సభ్యులు నాగులదాం నరసయ్య, మార్క రవీందర్ గౌడ్, లక్ష్మీనారాయణతో పాటు పరకాల సంస్థ సభ్యులు ఎడ్ల సుధాకర్, రాఘవరెడ్డి, గుర్రం సదానందం, నర్సింగరావు, ఎస్ శ్రీనివాసాచారి బి. మొగిలయ్య, ఏకు సారయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ రోజా రాణి, ఆర్డీవో కార్యాలయ అసిస్టెంట్ శైలజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -