Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన

భారత రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రామారావు తొమ్మిది, పది తరగతులకు చెందిన విద్యార్థులకు భారత రాజ్యాంగం పై అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం మీద ప్రవేశికలో ఉన్న పదాల విస్తృత అర్థాన్ని, 1976 ముందే లౌకికత్వాన్ని తెలియజేసే అంశమైన ఆర్టికల్ 14 నుండి 26 వరకు ఉన్నాయన్న విషయాన్ని వివరించారు.

దీనిని 1976లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రియంబుల్లో బహిర్గతం చేయడం జరిగిందని తెలిపిన ఆయన, దీనిపై రాద్ధాంతం అవగాహన రాహిత్యమేనన్నారు. రాజ్యాంగంలో కాపాడుకోవాల్సిన ఆవశ్యకత రాబోయే తరం మీద ఉందన్న అంశాన్ని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు శ్రీనివాస్, రంజిత్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిణి గంగామణి, ఉపాధ్యాయ బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -