Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చికెన్ సెంటర్లకు స్టన్నింగ్ పై ఉచిత శిక్షణ

చికెన్ సెంటర్లకు స్టన్నింగ్ పై ఉచిత శిక్షణ

- Advertisement -

జాతీయ మాంస పరిశోధన సంస్థ చెంగిచెర్ల డాక్టర్ సి రామకృష్ణ 
నవతెలంగాణ – తాడ్వాయి 

క్రూరంగా అతి కిరాతంగ రక్తపు మడుగులో నరకయాతన పడుతూ ప్రాణాలు వదిలిన కోడి నుండి లభించే మాంసాన్ని తినడం సరికాదని, ప్రధాన శాస్త్రవేత్త, జాతీయ మాంస పరిశోధన సంస్థ చెంగిచెర్ల హైదరాబాద్ డాక్టర్ సి రామకృష్ణ అన్నారు. శనివారం నవ తెలంగాణకు ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. స్టర్నింగ్ అనే ప్రక్రియ ద్వారా కోళ్లను అపస్మారక స్థితిలో పంపి(కోయడం) వధించడం ద్వారా కోళ్ల, మేకల మాంసాన్ని తినడం మంచిదని ఆయన అన్నారు. అపస్వారపు స్థితిలో ఉన్న కోడి, ఇతర ఏ జంతువు అయినా బాగా నొప్పి పెనుగులాట లేకుండా నిద్రావస్థలో ప్రాణాలు వదులుతాయి కనుక ఇలా స్టండింగ్ ప్రత్యేక ద్వారా వధించిన కోడి మాంసాన్ని మాత్రమే వాడాలని అన్నారు.

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కోళ్లను స్టన్నింగ్ చేయకుండా మాంసం కొరకు వధించి చిత్రహింసలు పెట్టడం చట్టం ప్రకారం ఒక నేరం అని అన్నారు. స్టన్నింగ్ చేయకుండా కోళ్లను ఇతర జంతువులను వధిస్తే జైలు కూడా వెళ్లాల్సి వస్తుందన్నారు. కావున చికెన్, మటన్ సెంటర్లు నిర్వహించే వారికి ఉచితంగా శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న చికెన్ మటన్ షాప్ యజమానులు, నిర్వాహకులు, కట్ చేసే కూలీలు స్టన్నింగ్ పై శిక్షణ తీసుకోవాలని కోరారు. శిక్షణకు వెళ్లేవారు 9247285278, మొబైల్ నెంబర్ ఫోన్ చేసి, drcrmakrishna@gmail.com సంప్రదించాలని, వారికి గవర్నమెంట్ తరఫున సర్టిఫికెట్ ఇవ్వబడుతుందన్నారు. తప్పకుండా చికెన్ మటన్ షాపులవారు శిక్షణ పొందాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -