నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. లింగాల, బంధాల గ్రామపంచాయతీ ల ఆదివాసి గిరిజనులు మండల కేంద్రానికి చాలా దూరంలో ఉండడం వలన రైతులు ఎరువులు తీసుకుపోవడానికి నానా ఇబ్బందులు పడేవారు. దీన్ని పరిశీలించిన అధికారులు పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. రైతులకు అందుబాటులో యూరియా నిలువలను ఉంచినట్లు తెలిపారు. ప్రతి ఒక్క రైతుకు సరిపడే యూరియా అందే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈవో స్వాతి, మాజీ సర్పంచ్ ఓకే మౌనిక నాగేశ్వరరావు, మాజీ ఎంపిటిసి ఊకే పోతురాజు, సింగిల్ విండో డైరెక్టర్ ఊకె నారాయణ, రైతులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.
లింగాలలో పీఏసీఎస్ ఎరువుల దుకాణం ప్రారంభం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES