- Advertisement -
నవతెలంగాణ – గంభీరావుపేట: ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ అపరించుకపోయిన ఘటన గంభీరావుపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ.రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం కోల మద్ది గ్రామానికి చెందిన వేముల శ్రీధర్ పల్సర్ బైకును రోజు మాదిరిగానే శుక్రవారం ఇంటి ముందట పార్కు చేశాడు. ఉదయం లేచి చూసే సరికి బైక్ కనిపించక పోవడంతో గంభీరావుపేట పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -