నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)ను, గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీసీడీవో) రమాదేవి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్ లు, స్టోర్ రూమ్ లను తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం బాలికలతో మాట్లాడి పాఠశాలలో మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి లో మెరుగైన ఫలితాలు సాధనకు కృషి చేయాలని వారికి సూచించారు. గత సంవత్సరం వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించినందుకు పాఠశాల స్పెషల్ అధికారి పుష్పనీలా, స్టాఫ్ ను అభినందించారు. ఈ సంవత్సరం కూడా 100కు 100% రిజల్ట్ సాధించి, జిల్లా స్థాయిలో మంచి ర్యాంకు సంపాదించి మంచి పేరు సంపాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్ ఇర్ప పుష్పనీల, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు తదితరులు ఉన్నారు.
జీసీడీఓ.. కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES