Monday, July 21, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కరెంట్ షాక్ తో ఇల్లు దగ్ధం..

కరెంట్ షాక్ తో ఇల్లు దగ్ధం..

- Advertisement -

ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందేలా చూడలి…
నవతెలంగాణ – కుభీర్ : మండలంలోని చాత గ్రామనికి చెందిన పూజారి శాంతిబాయి అనే పేద కుటుంబం ఇండ్లు శనివారం కరెంట్ షాక్ తో దగ్ధమైంది. బాధితురాలు శాంతా బాయి తెలపిన వివరాల ప్రకారం.. నాకున్న రేకుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో విద్యుత్ స్తంభం నుంచి ఇంటికి వచ్చే కరెంట్ తీగలు ప్రమాదవశాత్తు ఒక్కదానికి ఒక్కటి తగిలి, మంటలు రావడంతో ఇంటికి నిప్పు అంటుకుంది. అటువైపు వెళ్లే గ్రామస్తులు గమనించి అగ్నిమపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు వచ్చి మంటలను అర్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇల్లు పూర్తిగా కాలి బూడిద అయిపోయింది. దింతో ఇంట్లో రూ.50వేలు నగదుతో పాటు, దాదాపుగా మూడు లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని బాధితురాలు తెలిపారు. ప్రభుత్వం మమ్ములను ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -