నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రం శివారులోని శుక్రవారం దేవి ఆలయం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మండలంలోని హాస కొత్తూర్ గ్రామానికి చెందిన ఇరుగదిండ్ల శంకర్ (27) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్ ద్విచక్ర వాహనంపై హాస కొత్తూర్ నుంచి కమ్మర్ పల్లికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై నుండి ఎగిరి బీటీ రోడ్డుపై పడ్డ శంకర్ తలకు, ఎడమ చేతికి, ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన శంకర్‌ను వెంటనే 108 అంబులెన్స్ వాహనంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.మృతుడి భార్య తగు చర్య కొరకు దరఖాస్తు ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES