- Advertisement -
ప్రజలకు మెడికవర్ ఆస్పత్రి వైద్య పరీక్షలు
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని దాచారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కరీంనగర్ పట్టణ కేంద్రంలోని మెడికవర్ ఆస్పత్రి ఉచిత వైద్య శిబిరం శనివారం నిర్వహించింది. గ్రామంలో సుమారు 125 మంది ప్రజలకు ఆస్పత్రి వైద్యుడు గుర్రం కిరణ్ మధుమేహ, రక్తపోటు, ఈసీజీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలందించాలనే సదుద్దేశ్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని వైద్యులు కిరణ్ తెలిపారు. పంచాయితీ కార్యదర్శి సురేశ్,స్థానిక కాంగ్రెస్ నాయకులు భైర సంతోశ్,ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -