నవతెలంగాణ – సూర్యాపేట
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చక్కటి అవగాహన కలిగి, వాటి పరిష్కారానికి ముందుండాల్సిన బాధ్యత మున్సిపాలిటీదేనని కమిషనర్ హన్మంతరెడ్డి అన్నారు. 100 రోజుల పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం స్థానిక 42వ వార్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి వార్డులో చోటు చేసుకున్న సమస్యలపై తక్షణమే స్పందించేలా అధికారులను ఆదేశించామన్నారు.వార్డులోని రోడ్లు, డ్రైనేజీ, కూపన్ల పంపిణీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై స్థానికులు చేసిన ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని కమిషనర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు డీ.ఇ .సత్యారావు , సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ,టిపిఒ ఉయ్యాల సోమయ్య ,మాజీ కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ ,చలమళ్ళ నర్సింహా ,ఏ.ఇ తిరుమలయ్య ,వార్డు అధికారి రామసాని ప్రణీత ,టీఎంసీ శ్వేత,ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివప్రసాద్ , రుద్రంగి రవి ,పాండురంగా చారి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారమే మున్సిపాలిటీకి ప్రాధాన్యం: కమిషనర్ హన్మంతరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES