నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అనారోగ్య సమస్యలు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన తంగళ్ళపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వీరల ప్రకారం.. మండలంలోని గోపాల్ రావు పల్లి గ్రామానికి చెందిన కడారి జ్యోతి (35)భర్త మల్లారెడ్డి లు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పిల్లలు కలగకపోవడంతో మనోవేదనకు గురై ఓ పాపను దత్తత తీసుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ చదివించుకుంటున్నారు. ఈ తరుణంలో జ్యోతి అనారోగ్య పారిన పడడంతో భర్త మల్లారెడ్డి ఎన్నో ఆసుపత్రులను ఆశ్రయించాడు.
భార్యకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఎంతకీ నయం కావడం లేదు. శనివారం ఉదయం తన భర్త పొలానికి వెళ్లడంతో తన కూతురిని కూడా పాఠశాలకు పంపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన భర్త తన కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా తన ఆరోగ్యం ఎంతకీ కుదుటపాకపోవడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే తన భర్తకి ఫోన్ చేసి భోజనం చేసేందుకు ఇంటికి రమ్మని చెప్పిన భార్య తిరిగి భర్త ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తో ఇంటికి తిరిగి వచ్చేసరికి వివిధ జీవిగా కనిపించిన తన భార్యను చూసి బోరున విలపించాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అనారోగ్య సమస్యలతో మహిళ ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -