– తెలంగాణ మోడల్‌గా నిలుస్తుందన్న రాహుల్ గాంధీ
– రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కూడా ఎత్తివేయాలి
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం చేపట్టే కులగణనకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. కేంద్రం అనూహ్యంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే, కులగణనకు ఒక డెడ్‌లైన్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో చేపట్టిన కులగణన బ్లూప్రింట్‌గా నిలుస్తుందని చెప్పిన ఆయన.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కూడా ఎత్తివేయాలని అన్నారు. కులగణన కేవలం తొలి అడుగు మాత్రమేనని ఇంకా చాలా చేయాల్సి ఉందని చెప్పారు.
- Advertisement -