– సైంటిఫిక్ స్టడీ ఫోరం డిమాండ్
నవతెలంగాణ-కాకతీయ యూనివర్సిటీ:
కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దేశంలో అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా వున్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయనీ సైంటిఫిక్ స్టడీ ఫోరం(ఎస్.ఎస్.ఎఫ్), కాకతీయ యూనివర్సిటీ కో- ఆర్డినేటర్ అమర్ నాథ్ అన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్‌లో మౌలిక సదుపాయాల లేమి కారణంగా వేలాది పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పటికే నడుస్తున్న పాఠశాలల్లో విద్యార్థినులకు తాగు నీరు, వాష్ రూమ్స్ వంటి కనీస వసతులే లేవు. మరోవైపు నిరుద్యోగం యువతను తీవ్రంగా వేధిస్తోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో మే 7 నుంచి హైదరాబాద్ లో నిర్వహించబోయే ప్రపంచ సుందరి పోటీలు ప్రభుత్వాల విద్యార్థులు,యువత పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమనీ రుజువవుతోంది. ఈ పోటీలను సైంటిఫిక్ స్టడీ ఫోరం కాకతీయ యూనివర్సిటీ యూనిట్ వ్యతిరేకిస్తుంది.
మహిళలను వ్యాపార వస్తువుగా చూపే ఇటువంటి విశ్వసుందరి పోటీలను అన్ని వర్గాల ప్రజలు సైతం వ్యతిరేకించాలని మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచే ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకూడదని సైంటిఫిక్ స్టడీ ఫోరం డిమాండ్ చేస్తుంది. వీటి ద్వారా దేశ యువతను, సమాజాన్ని ఎటు వైపు మళ్ళించే ప్రయత్నం జరుగుతోందనీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది సాంస్కృతికంగా, నైతికంగా ఖండించదగిన విషయం.
ప్రభుత్వాలు తక్షణమే ఈ పోటీలను రద్దు చేయాలి. విద్య, ఉద్యోగం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. యువత భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఉదయ్, గణపతి, భార్గవ్, మనోహర్, గణేష్, జునైద్, పున్నం , సాయి కుమార్ పాల్గొన్నారు.
విశ్వసుందరి పోటీలను తక్షణం రద్దు చేయాలి.
- Advertisement -
RELATED ARTICLES