Sunday, July 20, 2025
E-PAPER
Homeబీజినెస్యూనియన్‌ బ్యాంక్‌ లాభాల్లో 12 శాతం వృద్ధి

యూనియన్‌ బ్యాంక్‌ లాభాల్లో 12 శాతం వృద్ధి

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 12 శాతం వృద్ధితో రూ.4,116 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 3,679 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.30,874 కోట్లుగా ఉన్న ఆదాయం.. గడిచిన క్యూ1లో రూ.31,791 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం 27,296 కోట్లకు చేరింది. 2024-25 క్యూ1లో వడ్డీ ఆదాయం రూ.26,364 కోట్లుగా చోటు చేసుకుంది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు క్రమంగా మెరుగుపడుతూ.. గడిచిన త్రైమాసికంలో 3.52 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 4.54 శాతం స్థూల ఎన్‌పీఏలు నమోదయ్యాయి. నికర నిరర్థక ఆస్తులు 0.90 శాతం నుంచి 0.62 శాతానికి తగ్గాయి. మొండి బాకీల కోసం కేటాయింపులు 1,1,53 కోట్లకు తగ్గాయి. 2024-25 ఇదే జూన్‌ త్రైమాసి కంలో మొండి బాకీల కోసం రూ.1,651 కోట్ల కేటాయింపులు చేసింది.

సెంట్రల్‌ బ్యాంక్‌ లాభాల్లో 33 శాతం పెరుగుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో సెంట్రల్‌ బ్యాంక్‌ నికర లాభాలు 33 శాతం పెరిగి రూ.1,169 కోట్లకు చేరాయి. ముఖ్యంగా కీలక ఆదాయం పెరగడంతో పాటుగా, మొండి బాకీలు తగ్గడంతో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.880 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.9,500 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన క్యూ1లో రూ.10,374 కోట్లకు చేరింది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 4.54 శాతం నుంచి 3.13 శాతానికి పరిమితమయ్యాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 0.73 శాతం నుంచి 0.40 శాతానికి దిగివచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -