నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్‌లో కుండపోత వర్షాలకు వరదలు పోటెత్తాయి. భారీ వదరల ధాటికి ఆదేశంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమైయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్‌లోని వరద ప్రభావిత జిల్లాలను హై అలర్ట్‌లో ఉంచారు. అంతేకాకుండా భారీ వర్షాలకు ఆస్తీ, ప్రాణ నష్టం వాటిల్లింది. ఆ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రకారం, వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 202 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దాదాపు సగం మంది పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.
మృతుల్లో కనీసం 118 మంది ఇళ్ళు కూలిపోవడంలో మరణించారు. అలాగే 30 మంది ఆకస్మిక వరదల్లో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు పిడుగుపాటు, విద్యుత్ షాక్, కొండచరియలు విరిగిపడటం వల్ల చనిపోయారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధిక మరణాలు సంభవించాయి. ఇక్కడ 123 మంది మృతిచెందారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 40 మంది, సింధ్‌లో 21 మంది, బలూచిస్థాన్‌లో 16 మంది, ఇస్లామాబాద్, ఆజాద్ జమ్మూకశ్మీర్‌లో ఒక్కొక్కరు మరణించారని ఆదేశ మీడియా సంస్థ జియో న్యూస్ పేర్కొంది.
నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్‌లో కుండపోత వర్షాలకు వరదలు పోటెత్తాయి. భారీ వదరల ధాటికి ఆదేశంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమైయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్‌లోని వరద ప్రభావిత జిల్లాలను హై అలర్ట్‌లో ఉంచారు. అంతేకాకుండా భారీ వర్షాలకు ఆస్తీ, ప్రాణ నష్టం వాటిల్లింది. ఆ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రకారం, వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 202 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దాదాపు సగం మంది పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.
మృతుల్లో కనీసం 118 మంది ఇళ్ళు కూలిపోవడంలో మరణించారు. అలాగే 30 మంది ఆకస్మిక వరదల్లో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు పిడుగుపాటు, విద్యుత్ షాక్, కొండచరియలు విరిగిపడటం వల్ల చనిపోయారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధిక మరణాలు సంభవించాయి. ఇక్కడ 123 మంది మృతిచెందారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 40 మంది, సింధ్‌లో 21 మంది, బలూచిస్థాన్‌లో 16 మంది, ఇస్లామాబాద్, ఆజాద్ జమ్మూకశ్మీర్‌లో ఒక్కొక్కరు మరణించారని పాకిస్థాన్ మీడియా సంస్థ జియో న్యూస్ పేర్కొంది.