Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్22 నుంచి కేవీపీఎస్ రాష్ట్ర శిక్షణా తరగతులు

22 నుంచి కేవీపీఎస్ రాష్ట్ర శిక్షణా తరగతులు

- Advertisement -

జిల్లా కార్యదర్శి అన్నం పట్ల కృష్ణ. .
నవతెలంగాణ – భువనగిరి

ఈనెల 22, 23, 24 తేదీలలో సూర్యపేటలో నిర్వహించే కెవిపిఎస్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి అన్నం పట్ల కృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడారు. ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన అనే లక్ష్యాల సాధన కోసం ఒక చారిత్రక అవసరంగా ఈ సంఘం ఏర్పడి 27 ఏళ్ల సామాజిక ఉద్యమ ప్రస్థానంలో అనేక సమరశీల పోరాటాలు కెవిపిఎస్ నిర్వహించిదన్నారు. దళిత గిరిజనుల జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు చట్టం చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కోసం రాష్ట్రంలో 102 సామాజిక ప్రజాసంఘాలను ఐక్యం చేసి విశాల ఐక్య ఉద్యమం నిర్వహించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సాధించడం జరిగిందన్నారు.

కుల వివక్ష అంటరానితనం పై వేలాదిమంది కార్యకర్తలను వందలాది గ్రామాల్లో సర్వేలు నిర్వహించామన్నారు. సుమారు 128 రకాల కుల వివక్ష రూపాలను గుర్తించి వాటిని రూపు మాపడానికి ప్రత్యేక కమిషన్ వేయాలని సుదీర్ఘ ఉద్యమం నిర్వహించి ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టాన్ని సాధించిందన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల విద్యా వసతులు మెరుగుపరచడానికి మెస్ కాస్మెటిక్ చార్జీలు పెంచాలని ప్రతి ఏడాది సంక్షేమ హాస్టల్ల యాత్ర నిర్వహించి విద్యార్థుల సమస్యలు వెలికి తీసి అధికార దృష్టికి తీసుకువెళ్లి మిస్ చార్జీలు పెంచడం జరిగిందన్నారు. దళితులకు ఉచిత విద్యుత్తు,  కులాంతర వివాహితుల ప్రోత్సాహకం  పెంచడం, దళితులకు స్మశాన వాటిక స్థలము, ఇలా అనేక దశల వారి పోరాటాలు నిర్వహించి చట్టాలు తీసుకురావడం జరిగిందన్నారు.

  రాష్ట్రంలో అనేక కుల దురంకార హత్యలు నేటికీ జరుగుతుండడం బాధాకరమన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని మోసం చేసిందన్నారు.  కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా దళితులపై హత్యలు అత్యాచారాలు దాడులు చేయిస్తూ రిజర్వేషన్ తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ రోజుకో పేజీ చొప్పున రాజ్యాంగాన్ని అంతం చేసే ప్రయత్నంలో భాగంగా పరిపాలన కొనసాగిస్తా ఉందన్నారు.  దేశంలో రాష్ట్రంలో సామాజిక ఆర్థిక దాడుల కు గురవుతున్న దళితులకు అండగా ఉంటూ కెవిపిఎస్ నిరంతరం పోరాడుతుందన్నారు. రాబోయే కాలంలో సంఘం నిర్వహించే అనేక పోరాటాలలో మేధావులు, ప్రజలు భాగస్వాములు కావాలని  కృష్ణ విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -