- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధాని మోడీ జులై 23 నుంచి 26 వరకు బ్రిటన్, మాల్దీవుల్లో నాలుగు రోజుల అధికారిక పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా కొనసాగనుంది. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆహ్వానం మేరకు మోడీ జులై 23-24 తేదీల్లో యూకేను సందర్శిస్తారు. జులై 25-26 తేదీల్లో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశాన్ని సందర్శిస్తున్నట్లు సమాచారం.
- Advertisement -