సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు చూడి కృష్ణారెడ్డి
మండల కేంద్రంలో ఘనంగా సంస్కరణ సభ
నవతెలంగాణ – తాడ్వాయి
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ గౌని అంజయ్య సేవలు మరువలేనివని, ఆయన ఆశయాలను నీటి యువత ముందుకు తీసుకెళ్లాలని సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యులు చూడి కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ లు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కీర్తిశేషులు కామ్రేడ్ గౌని అంజయ్య సంస్కరణ సభ ఘనంగా నిర్వహించారు. మొదట ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడిన వ్యక్తి అంజయ్య అని కొనియాడారు. నేడున్న సమాజంలో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి, నీతి నిజాయితీకి పేదల పక్షాన రాజీలేని పోరాటాలు చేశారని, తాడ్వాయి మండల కేంద్రంలో కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించడంలో అంజయ్య కీలక పాత్ర పోషించాడు అని అన్నారు.
డబ్బుల మధ్య ఇప్పుడున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బులకు మద్యానికి అమ్ముడుపోయే సమాజంలో అక్రమాలకు తావు ఇవ్వకుండా, శత్రువులకు లొంగకుండా ఎర్రజెండా నే నమ్ముకుని, దోపిడికి, పాలక ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలని సమీకరించి ముందు నడిపించిన వ్యక్తి అంజయ్య అని వారన్నారు. కామ్రేడ్ కీర్తిశేషులు గౌని అంజయ్య మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలు నిర్మించాడని, అనేక దాడులు ఎదుర్కొంటూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని మండలంలో కాపాడడంలో ఎంతో కీలకపాత్ర పోషించా డని పేర్కొన్నారు. నేటి యువత అంజయ్య ఆశయ సాధన కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకట్ రెడ్డి, పొదిల్ల చిట్టిబాబు, ఎండి దావూద్, రత్నం రాజేందర్, కొప్పుల రఘుపతి, జ్ఞానం వాసు, జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి చిరంజీవి, గొంది రాజేష్, సోమ మల్లారెడ్డి, జేజ్జరి దామోదర్, గుగ్గిల దేవయ్య, బచ్చల కృష్ణబాబు, కట్ల నరసింహ చారి, రత్నం ప్రవీణ్, పంజాల శ్రీనివాస్, దాసరి కృష్ణ కుటుంబ సభ్యులు గౌని మధు తదితరులు పాల్గొన్నారు.