కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవి గౌడ్
గౌని అంజయ్య సంతాప సభలో వెల్లడి
నవతెలంగాణ – తాడ్వాయి
తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం సీనియర్ నాయకులు గౌని అంజయ్య గౌడ్ స్ఫూర్తితో కల్లుగీత కార్మిక సంఘం హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తామని ములుగు జిల్లా తెలంగాణ కర్మిక సంఘం ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్, కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కీర్తిశేషులు గౌని అంజయ్య సంతాప సభలో మాట్లాడారు. గతంలో ములుగు తాలూకా లో గత 30 సంవత్సరాలక్రితం కల్లు గీత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి గౌని అంజయ్య గౌడ్ అని అన్నారు. ఆయన కల్లుగీత కార్మికులకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘానికి తీరని లోటు అని అన్నారు. అంజయ్య గౌడ్ కల్లు గీత కార్మిక సంఘం లోపని చేయడం అభినందనియమన్నారు. అయన కుటుంబం కు సంఘం జిల్లా కమిటీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు రంగు సత్యం, మొక్క రాజు గౌడ్, మొక్క దుర్గయ్య గౌడ్, అన్నపురం రాజు, వార్డెల్లి వెంకన్న, చెవుగాని ఆంజనేయులు, రఘు గౌడ్, గుండు శివ శంకర్ గౌడ్, 30 మందిగీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
గౌని అంజయ్య గౌడ్ స్ఫూర్తితో కల్లు గీత కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేస్తాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES