Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీవో నెంబర్ 49 రద్దు చేయాలి.. 

జీవో నెంబర్ 49 రద్దు చేయాలి.. 

- Advertisement -

తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పాయం కోటేశ్వరరావు 
నవతెలంగాణ – తాడ్వాయి 

ఆదివాసి అత్యుత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రజాభిషానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నెంబర్ 49ను తక్షణమే రద్దు చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి(తుడుం దెబ్బ) జిల్లా అధ్యక్షులు పాయం కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు కోర్నెబెల్లి వీరేశం స్థూపం వద్ద తుడుందెబ్బ మండల అధ్యక్షులు మోకాళ్ళ వెంకటేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల జీవితాలతో బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆడుతున్న చెలగాటం మానుకోవాలి అన్నారు. 49 జీవో అమలు వల్ల ఆదివాసీలు సాగు చేసుకుంటున్నాం భూములపై హక్కులు కోల్పోతారని.. ఇది జాతి మనుగడకు దెబ్బతీసే విధంగా ఉంది అని మండిపడ్డారు. తక్షణమే 49 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నేడు ఏజెన్సీ బందు ప్రకటించినట్లు తెలిపారు. బందు పాటించి అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోకాళ్ళ వెంకటేష్, తుడుందెబ్బ నాయకులు తాటి నరేష్, సోలం రాము, తుడుందేబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -