- Advertisement -
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి బాల్కొండ నియోజకవర్గంలో అత్యవసరంగా చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులను ఆయన ముందు ప్రస్తావించారు. అలాగే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయించవలసిందిగా కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పినట్లు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు.
- Advertisement -