Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దండకారణ్యంలో ఆదివాసీలపై దాడులను ఆపాలి

దండకారణ్యంలో ఆదివాసీలపై దాడులను ఆపాలి

- Advertisement -

ఆపరేషన్ కగార్ ను నిలిపి వేయాలి
ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట వేదిక
నవతెలంగాణ – కాటారం

ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక  బహిరంగ సభ – సన్నాహాక సమావేశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారం మండల కేంద్రంలో ఆదివాసీలపై దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక 27 జులై, 2025 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా  కాటారం మండల కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు సంబందించిన సన్నాహాక సమావేశాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో  ఆదివారం నాడు ఆవిష్కరించారు.  

ఈ సందర్బంగా ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట వేదిక నాయకులు మాట్లాడుతూ.. అడవులలోని కొట్లాది అటవీ, ఖనిజా సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి 1990 నుండి 2025 వరకు ఆపరేషన్ జన జాగరన్ అభియాన్, సల్వాజూడం,, గ్రీన్ హంట్,ఆపరేషన్ సమాధాన్,ఆపరేషన్ అనకొండ, చివరకు ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులను అడవులనుండి వెళ్లగొట్టే ప్రయత్నాలు కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని,  అందులో బాగాంగానే ఆరు నెలల పసి గుడ్డు  మంగ్లీ సోడి మొదలు రేణుక@ మిడ్కో వరకు దాడులు, హత్యలు, అత్యాచారాలు కొనసాగిస్తున్నదని ఆరోపించారు. 

దీనికోసం ఆదివాసీలకు అన్ని వర్గాల ప్రజలు,దళితులు,మేధావులు, హక్కుల కార్యకర్తలు అండగా ఉండాలని కోరారు. భూమి, భూక్తి, విముక్తి, ఆత్మగౌరవం  కోసం జరిగిన  పోరాటంలో  ఆదివాసులపై జరిగిన హత్యకాండను నిరసిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  బహిరంగ సభను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు ముడిమడుగుల మల్లన్న. దాముక లక్ష్మణ్, టి. రత్నకుమార్, బాలసాని రాజయ్య, గుమ్మడి కొమురయ్య , రామిళ్ల బాపు, పీక కిరణ్, ఐతా బాపు, లెనిన్, ఆదివాసీ నాయకులు సుంకరి మల్లేష్, పొలం రాజేందర్, సోదుల శంకర్, కత్తెర్ల మధునయ్య, అక్కల బాపు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -