- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేయడం తెలిసిందే. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. నేడు బోనాల పండగ సందర్భంగా నగరంలోని సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజాసింగ్, అనంతరం మీడియాతో మాట్లాడారు. గోషామహల్ లో ఉప ఎన్నిక వచ్చినా తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. ఎవరు పోటీ చేసినా తానేమీ బాధపడనని స్పష్టం చేశారు.
- Advertisement -