అవి నేను కవిత్వం రాయడం మొదలు పెట్టిన తొలినాళ్ళు. వివిధ పత్రికల సండే మ్యాగజైన్లతో మినహా సాహిత్య పుస్తకలతో పెద్ద పరిచయం లేదు అప్పటికి. ఎలా చేరాయో గుర్తుకులేదు కానీ బోయ జంగయ్య రచనలు వచ్చి చేరాయి. అలా బోయ సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. దాని తర్వాత కవిత్వంతో నడక ఇంకా సులభతరమయ్యింది.
నేను కవిత్వం రాయడానికి మా సైన్స్ టీచర్ నాగార్జున సార్ ప్రేరణనిస్తే, అవి సమాజపరం కావడానికి స్ఫూర్తినిచ్చింది భోయ రచనలు. ఈయన తెలుగు సాహిత్య లోకానికి కథలుగా సుపరిచితం, కానీ నాకు మాత్రం కవిగానే ప్రేరణ.
వీరి రచనలు బోయ కవితలు, బోయ కథలు, రంగులు, చీమలు, జాతర, ఇంకా మరెన్నో నాటికలు, కథలు కవితా సంపుటాలు వెలువరించారు. దాదాపు 50 ఏళ్ల ఆయన సాహిత్య ప్రస్థానంలో ఆయన రచనలన్నీటీలో దళితవాదం గ్రామీణ జనజీవన చిత్రాన కనిపిస్తుంది. ఆయన రచనల్లో నన్ను ప్రభావితం చేసింది. పావురాలు వచన కవిత్వం.
అప్పటికి వచన కవిత్వం ఆధునీకరణ జరుగుతున్న అవి సామాన్య ప్రజలకు అర్థమయ్యే వ్యాకరణాలతో వచ్చినది తక్కువ. అలాంటి సందర్భంలో వచ్చిందే పావురాలు. ఇందులో వాడిన భాష చాలా సహజంగా సరళంగా ఉంటుంది. ప్రతి కవిత్వంలో గ్రామీణ జనజీవన చిత్రణ చాలా స్పష్టంగా సంభాషణ పోలినట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది.
భూమి మీద ఎన్నో ప్రాణులు ఉద్భవించాయి. కాని మనిషి ఒక్కడే ఆ జీవుల నుండి వేరు పడి తనకంటూ ఒక సమాజాన్ని ఏర్పరచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ మనుషుల మధ్య వర్ణం వర్గం కుల మతం ఇలా వివిధ రకాలుగా విభజన రేఖల్ని గీసుకున్నాడు. వివక్షతల్ని పెంచిపొషిస్తున్నాడు. ఇలాంటి వివక్షలకు వ్యతిరేకంగా, సామజిక రుగ్మతలు, మూడత్వాన్ని నిర్మూలించటం గురించి మనకు పావురాలు కవితా సంపుటిలో కనిపిస్తుంది. హక్కుల కార్యకర్త కె. బాలగోపాల్ అన్నట్టు సామాన్య జనం చూడలేని కోణాన్ని సాహిత్యం చూపించగలగాలి. ఆ పని పావురాలు చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఆర్థిక రాజకీయ సామజికంగా సామాన్య ప్రజలు ఎన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నారో అనేది చూపిస్తూనే వారిని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసింది అని చెప్పుకోవచ్చు.
– హాథిరామ్ సభావట్, 6309862071
చైతన్యవంతం చేసే కథలు
- Advertisement -
- Advertisement -