Monday, July 21, 2025
E-PAPER
Homeవరంగల్రుద్రారంలో నీటి ఎద్దడి.!

రుద్రారంలో నీటి ఎద్దడి.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామంలోని మంగలివాడ, కొండవాడ,ఎల్లిపాయలవాడ తదితర వాడల్లో గత మూడు నెలలుగా నీటి ఎద్దడి ఉందని స్థానిక పంచాయతీ కార్యదర్శి,మండల పరిషత్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.నీరు తాగడానికి, నిత్యావసర కాలకృత్యాలు తీర్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నట్లుగా పేర్కొన్నారు. బోరు వేశారు కానీ మోటార్ బిగించలేదని చెబుతున్నారు.వాటర్ ట్యాoకర్ తో నీటి సరఫరా చేసిన నీరు సరిపోవడం లేదని వాపోతున్నారు.ట్యాoకర్ తో నీరు రోజు సరఫరా చేయడం లేదని నాలుగైదు రోజులకు ఒక్కసారి చేయడంతో ఇబ్బందులకు గురివుతున్నట్లుగా వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు ట్యాoకర్ తో నీరు నిత్యం సరఫరా చేయాలని లేదంటే బోర్ బావికి మోటార్ బిగించాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -