Monday, July 21, 2025
E-PAPER
Homeసినిమా'కొత్తపల్లి...'కి అద్భుతమైన రెస్పాన్స్‌

‘కొత్తపల్లి…’కి అద్భుతమైన రెస్పాన్స్‌

- Advertisement -

రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా ప్రజెంట్‌ చేసిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ‘కేరాఫ్‌ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్‌ ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్‌ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి, సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.
ఈ సందర్భంగా మేకర్స్‌ ఏర్పాటు చేసిన థ్యాంక్యూ మీట్‌లో డైరెక్టర్‌ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ,’సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇండీ సినిమా తీయాలంటే చాలా కష్టం. సినిమాని రిలీజ్‌ చేసి ఆడియన్స్‌ దగ్గరికి తీసుకెళ్లడం ఇంకా పెద్ద టాస్క్‌. అయితే ఈ జర్నీ ఎంత కష్టమైనా ఆడియన్స్‌ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సందర్భంగా ఆడియన్స్‌కి హదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక నమ్మకం గురించిన కథ ఇది. ఒక లైట్‌ హార్టెడ్‌ కామెడీతో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం జరిగింది. ఉష నేచురల్‌ డాన్స్‌ టాలెంట్‌ చూసి ఈ సినిమాలో తీసుకున్నాం. వర్క్‌ షాప్స్‌ కూడా చేయించాం. రామకష్ణ, ఉష పాత్రలకు చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. వారు నా నమ్మకాన్ని నిలబెట్టారు. నటులు కావాలని వాళ్ళ కలని మీరందరూ నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు మరిన్ని అవకాశాలు వారికి ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. చాలా మంచి అనుభూతినిస్తుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -