Monday, July 21, 2025
E-PAPER
Homeఆటలుమురళీ పసిడి జంప్‌

మురళీ పసిడి జంప్‌

- Advertisement -

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ చాంపియన్‌షిప్స్‌
న్యూఢిల్లీ:
ప్రపంచ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ పోటీల్లో భారత యువ అథ్లెట్‌, లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ అదరగొట్టాడు. పోర్చుగల్‌లో జరుగుతున్న పోటీల్లో మురళీ మెన్స్‌ లాంగ్‌జంప్‌లో 7.75 మీటర్ల జంప్‌తో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. తొలి ప్రయత్నంలో 7.63 మీటర్లు దూకాడు. రెండోసారి 7.75 మీటర్ల ప్రదర్శన చేయగా మూడోసారి 7.69 మీటర్లు జంప్‌ చేశాడు. నాలుగో రౌండ్‌లో ఫౌల్‌ అయినా… తర్వాతి వరుస రౌండ్లలో 6.12 మీ, 7.58 మీ జంప్‌ చేశాడు. 7.75మీ జంప్‌తో అగ్రస్థానంలో నిలిచిన మురళీ బంగారు పతకం సాధించాడు. టర్కోస్కి (పోలాండ్‌), క్రిస్‌ (ఆస్ట్రేలియా) సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ దక్కించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -