Monday, July 21, 2025
E-PAPER
Homeజాతీయంపెరుగుతున్న నిరుద్యోగం, అసమానతలు

పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతలు

- Advertisement -

దామాషా ప్రకారం పెరగని వేతనాలు, ఉపాధి
పనిహక్కు ప్రాథమిక హక్కుల్లో భాగం కావాలి
డీవైఎఫ్‌ఐ జాతీయ సదస్సులో ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశంలో హిందూత్వ నయా ఫాసిస్ట్‌ ప్రభుత్వ నవ ఉదారవాద విధానాల ఫలితంగా నిరుద్యోగం, అస మానతలు పెరుగుతున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని హరికిషన్‌ సింగ్‌ సుర్జిత్‌ భవన్‌లో జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ మాట్లా డుతూ… దేశంలో కార్మిక ఉత్పాదకత, వద్ధి రేటు పెరిగాయని చెప్పగలిగినప్పటికీ, వేతనాలు, ఉపాధి దామాషా ప్రకారం పెరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పని హక్కు ప్రాథమిక హక్కులలో భాగం కావాలన్నారు. ఒక వ్యక్తికి ఉద్యోగం లభించడంలో సామాజిక పరిస్థితులు పెద్ద పాత్ర పోషిస్తాయనీ, నిరుద్యోగ సమస్యపై డీవైఎఫ్‌ఐ లేవ నెత్తుతున్న పోరాటాలు స్వాగతించదగి నవని ప్రభాత్‌ పట్నాయక్‌ చెప్పారు. ఫాసిస్ట్‌, నయా ఫాసిస్ట్‌ ప్రభుత్వాలు ఉన్న అన్ని దేశాలలో నిరుద్యోగ రేటు పెరు గుతోందని పట్నాయక్‌ చెప్పారు. దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగం, హిందూ త్వానికి వ్యతిరేకంగా యువత ఐక్యంగా పోరాడాలని ప్రకాశ్‌కరత్‌ పిలుపు నిచ్చారు. గత కొన్నేండ్లుగా దేశంలో ప్రజలను విభజించే ప్రయత్నాలు తీవ్రమ వుతున్నాయనీ, యువతను సంఘటితం చేయడం ద్వారా అలాంటి ప్రయత్నా లను ప్రతిఘటించాలని ఆయన సూచించారు. నిరుద్యోగంపై పోరాటాలను హిందూత్వ వ్యతిరేక పోరాటంగా మార్చాల్సిన అవసరమున్నదని నొక్కి చెప్పారు.

బీజేపీ ప్రభుత్వ ఉదాసీన వైఖరి : రాజ్యసభ ఎంపీ ఎ.ఎ రహీం
రాజ్యసభ ఎంపీ, డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఎ.ఎ రహీం మాట్లాడుతూ.. అధిక పని ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఎర్నాకుళానికి చెందిన అన్నా సెబాస్టి యన్‌, బెంగళూరులోని ఓలా కంపెనీ ఏఐ విభాగంలో పనిచేసిన నిఖిల్‌ సోమవంశీ ఆత్మహత్యలకు న్యాయం చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఉదాసీ నంగా వ్యవహరించిందని విమర్శిం చారు. ఈ సదస్సులో అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్‌, సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి ఎ.ఆర్‌ సింధు, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ తదితరులు ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. డీవైఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమఘ్నరాజ్‌ భట్టాచార్య, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్‌ ఎం. సాజి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న తదితరుల పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -