Monday, July 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుడీలిమిటేషన్‌పై నాది, సీఎందీ ఒకటే స్టాండ్‌

డీలిమిటేషన్‌పై నాది, సీఎందీ ఒకటే స్టాండ్‌

- Advertisement -

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ఆధిపత్యం తగదు : జర్నలిజం టాక్‌ షోలో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)పై తనది, సీఎం రేవంత్‌ రెడ్డిది ఒకే వైఖరి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. డీలిమిటేషన్‌పై చెన్నైలో జరిగిన సమావేశంలో తాను, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే స్టాండ్‌ను వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జనాభా లెక్కల ప్రకారం సీట్ల పంపకం ఉండకూడదనే వెల్లడించామని స్పష్టం చేశారు. ఒకవేళ డీలిమిటేషన్‌ చేయాలనుకుంటే ఎమ్మెల్యేల సంఖ్య పెంచాలనేదే తమ పార్టీ డిమాండ్‌ అని కేటీఆర్‌ వివరించారు. ఆదివారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన జర్నలిజం టాక్‌ షోలో కేటీఆర్‌ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిగ్‌బాస్‌లా కాకుండా బిగ్‌ బ్రదర్‌లా వ్యవహరిస్తే బాగుంటుందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం సరికాదని సూచించారు. వలస కార్మికులను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ సొంత బిడ్డల్లా చూసుకున్నారని కేటీఆర్‌ గుర్తుచేశారు. 2020-21 కోవిడ్‌ కాలంలో యూపీ, రాజస్తాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికు లకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించారన్నారు. దేశంలో ఇలా పంపించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని గుర్తుచేసుకున్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తారా?
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని కేటీఆర్‌ విమర్శించారు. ఏదైనా లాభం ఉంటేనే కమలం పార్టీ పనిచేస్తుందని దుయ్యబట్టారు. కాశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా మార్చా లని ఎవరైనా అడి గారా? ఎందుకు మార్చారు? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వాల ఆదే శానుసారం దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటిస్తే, ఉత్తరాది ఆ పని చేయలేదని తెలిపారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ చేస్తే దక్షిణాదిపై ఉత్తరాది రాష్ట్రాల అజమాయిషీ పెరుగుతుందనీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశం మొత్తాన్ని హిందీ బెల్ట్‌ లీడ్‌చేసే పరిస్థితి వస్తుందని, ఇది దేశానికి ప్రమాదకరమని హెచ్చ రించారు. 2014-23 వరకు తాము మోడీకి పూర్తిగా మద్దతు ఇవ్వలేదనీ, అంశాలవారీగానే ఇచ్చామని వివరించారు. సమాఖ్య దేశంలో రాష్ట్రాలు, దేశం కలిసి వెళ్లాలన్నదే తమ అభిమతమన్నారు. హైదరాబాద్‌లో మంచి వనరులున్నాయనీ, ఎంఎస్‌ఎంఈ కంపెనీలు అక్కడ పెట్టాలని కోరారు.

హిందీ రుద్దడమెందుకు?
ఇతర రాష్ట్రాలపై తెలుగును బలవంతంగా రుద్దుతున్నామా? తమపై బలవంతంగా హిందీని రుద్దడమెందుకు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అనీ, అలాంటి ఐక్యతలో హిందీ భాషను అందరూ నేర్చుకోవాల్సిందేనని చెప్పడం తగదన్నారు. హిందీ నేర్చుకో వాలా? వద్దా? అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు తీసుకునే నిర్ణయమని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. హిందీ భాష కోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించిన కేంద్రం తెలుగు, తదితర భాషల కోసం ఎందుకు కేటాయిం చలేదని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్లు రాజ్యభాష లేకుండానే దేశం బాగుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -