Tuesday, July 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌ అందరినీ ఆహ్వానిస్తోంది

హైదరాబాద్‌ అందరినీ ఆహ్వానిస్తోంది

- Advertisement -

– ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పోస్ట్‌
– పలు భాషల్లో స్వాగతం చెబుతూ తెలంగాణ మ్యాప్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జాతీయ భాషపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ‘మా రాష్ట్రం అందరినీ ఆహ్వానిస్తోంది’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలో మరాఠీ, కర్ణాటకలో కన్నడ, తమిళనాడులో తమిళం నేర్చుకోవాలని ఆయా ప్రాంతాల్లో ఇతర భాషలు మాట్లాడే వారిపై ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ రైజింగ్‌-2047 పేరుతో వివిధ భాషల లిపితో కూడిన తెలంగాణ మ్యాప్‌ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
అందులో తెలుగు హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూ, తమిళం, కన్నడ, ఫ్రెంచ్‌, స్పానిష్‌, జపనీస్‌ వంటి వివిధ దేశాలలోని భాషలతో ‘స్వాగతం’ అని రాసి ఉంది. ‘హైదరాబాద్‌ అందరినీ ఆహ్వానిస్తోంది’ అని పోస్టర్‌ టైటిల్‌తో పాటు తెలంగాణ రైజింగ్‌ -2047 లోగో, సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటోతో పోస్టర్‌ విడుదల అయింది.పెట్టుబడులు, వ్యాపారం, జాబ్‌, చదువు, స్థిరపడ్డానికి, పర్యాటకానికి హైదరాబాద్‌కు రావొచ్చని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. అలాగే ‘మీరు ఏ భాష మాట్లాడినా, ఏ దుస్తులు ధరించినా, ఎవరితో నివసిస్తున్నా, మీరు నమ్మే విశ్వాసం ఏదైనా.. కూడా హైదరాబాద్‌ మిమ్మల్ని స్వాగతిస్తోంది’ అని పేర్కొన్నారు.
భాష పేరుతో రాజకీయాలు జరుగుతున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పోస్ట్‌ ఉత్తేజకరంగా ఉందని అంకిత్‌ కుమార్‌ అవస్థి అనే యూజర్‌ సీఎం ట్వీట్‌కు స్పందించారు. దీంతో సీఎం రేవంత్‌ రెడ్డి, అంకిత్‌ పోస్ట్‌కు రీట్వీట్‌ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, హైదరాబాద్‌ ఎల్లప్పుడూ దేశమే కాదు…. ప్రపంచంలోని ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -