Monday, July 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకంటోన్మెంట్‌ ఎమ్మెల్యేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

- Advertisement -

నవతెలంగాణ-కంటోన్మెంట్‌/ ఓయూ
హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తార్నాకలో బోనాల జాతరలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌ సమీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనంపై 50 మంది దుండగులు దూసుకొచ్చారు. వారిని అడ్డుకోబోయిన గన్‌మెన్‌ల చేతిలో నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. దుండగుల బారి నుంచి తప్పించుకుని ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విషయం తెలుసుకున్న రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీహరి ఓయూ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను పరామర్శించారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉన్నారు. నిందితుల కోసం డీసీపీ బాలస్వామి ఆధ్వర్యంలో పోలీసులు సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -