నవతెలంగాణ-హైదరాబాద్ : డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ శుక్రవారం విడుదలకానుంది. బుధవారం దోస్త్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఈ సారి మూడు విడతల్లో సీట్లు భర్తీచేస్తారు. శుక్రవారం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.
- Advertisement -