Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులను నిలువునా దోచుకుంటున్న ఫెర్టిలైజర్ షాప్ యజమానులు 

రైతులను నిలువునా దోచుకుంటున్న ఫెర్టిలైజర్ షాప్ యజమానులు 

- Advertisement -

ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు యూరియా కష్టాలు..
ఫెర్టిలైజర్ షాప్స్ యజమానులకు అండదండగా అధికారులు
రామిల్లా కిరణ్.. బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కాటారం మండలం 
నవతెలంగాణ – కాటారం

రైతన్న కండ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. ఈ సీజన్లో సరిపడాల్సిన యూరియాని రైతులకు అందుబాటులో ఉంచక వారిని అరిగోస పెడుతున్నారు. పేరుకే ప్రజా ప్రభుత్వం కానీ, చేతల్లో చూస్తే రైతుకు సున్నం పెట్టే ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నేడు కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రామిల్లా కిరణ్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మాట్లాడుతూ .. “మంత్రి శ్రీధర్ బాబు” స్వంత మండలంలో రైతులను నిలువుగా దోచుకుంటున్న ఫెర్టిలైజర్ షాప్ ఓనర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకా ఏమైనా ఉంటదా అని, ఆరుగాలం కష్టపడి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అన్నం పెట్టే రైతాంగం ఉసురుపోసుకుంటున్న ఫెర్టిలైజర్ యజమానులపై చర్యలు ఏవి అని నిలదీశారు. అధికార పార్టీ నాయకుల అండ దండలతోనే  రైతుల నుండి అధిక ధరలు వసూలు చేస్తున్నారు అని, అధిక రేట్లను కట్టడి చేయాల్సిన అధికారులకు నోట్ల కట్టలు ముట్టినందుకే నోరు మూసుకుంటున్నారని విమర్శించారు. రైతుల అవసరాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని రూ.266.50 కి ఇవ్వాల్సిన ఒక యూరియా బస్తని రూ.350 కు అమ్ముతున్నారంటే,  ఒక్క రైతు దగ్గర బస్తాకి రూ.83. 50 పైసలు దోచుకుంటున్న ఫెర్టిలైజర్ షాప్ నిర్వాహలకుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధిత అధికారుల పైన కూడా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. లేని పక్షాన రైతుల కోసం బిఆర్ఎస్ పార్టీ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో అధిక ధరల కట్టడి చేయాలని ధర్నా చేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -