సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.డి జహంగీర్
నవతెలంగాణ – భువనగిరి
రాబోయే స్థానిక ఎన్నికల్లో అనుసరించే రాజకీయ వైఖరి, తక్షణ ప్రజాసమస్యలపై జిల్లా వ్యాప్త కార్యాచరణ రూపొందించడం మొదలగు అంశాలపై ఈనెల 29న చౌటుప్పల్ యం.ఎస్ ఫంక్షన్ హాల్లో జిల్లా విస్తృత స్థాయి సమావేశం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని మండలాల ముఖ్య కార్యకర్తలు హాజరవుతారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏడాది పైగా ఎన్నికలు నిర్వహించక, గ్రామాల అభివృద్ధి తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకేమి పట్టనట్లు వ్యవహరించి గాలి కొదిలేశారన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటూ సీపీఐ(ఎం) ఈమధ్య కాలంలో అనేక ఉద్యమాలు చేసి పలు సమస్యలు సాధించిందన్నారు. నిస్వార్థంగా ప్రజల మధ్య పనిచేసే సీపీఐ(ఎం)ను గెలిపించడం ద్వారానే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సీపీఐ(ఎం) శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయన్నారు. గ్రామీణ ఉద్యమాలపై ఆగష్టు, సెప్టెంబర్ మసాల్లో కేంద్రీకరించి పని చేసేందుకు ఈనెల 29న జిల్లా విస్తృత సమావేశం కార్యాచరణ రూపొందిస్తామని జహంగీర్ ప్రకటనలో తెలిపారు.
29న సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES