సత్వర చర్యలు తీసుకోవాలి ఆదేశాలు జారీ
నవతెలంగాణ – కంఠేశ్వర్
మహిళ ఫిర్యాదు పట్ల నిజామాబాద్ పోలీస్ కమిషనర్ స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి మహిళా ఫిర్యాదుదారులు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ కార్యాలయానికి రావడం జరిగింది. ఉదయం సమయంలో అప్పుడే అటువైపు నుంచి పోలీస్ కార్యాలయానికి వస్తున్న కమిషనర్ పి. సాయి చైతన్య ఆ మహిళా ఫిర్యాదురాలిని చూసి తన కారులో నుంచి దిగి, ఆమె ఫిర్యాదును తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె పేరు భామని సవిత అని, తన భర్త వేధింపులు, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు అని తెలిపింది. ఈ క్రమంలో మహిళ ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కు ఆదేశాలు జారీ చేశారు.
మహిళ ఫిర్యాదు పట్ల వెంటనే స్పందించిన పోలీసు కమిషనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES