Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చాలీచాలని నాసిరకం పనులతో వజ్ర ఖండి 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణం

చాలీచాలని నాసిరకం పనులతో వజ్ర ఖండి 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
 మండలంలోని వజ్రఖండి గ్రామంలో నిలిచిన 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణం చాలీచాలని పనులతో నాసిరకంగా నిర్మాణాలు చేశారని ప్రజల ఆరోపిస్తున్నారు. వివరాల ప్రకారం వజ్రఖండి గ్రామంలో ఒక కోటి రూపాయలు వ్యయం తో సబ్ స్టేషన్ నిర్మించేందుకు నాటి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై పనులు ప్రారంభం చేశారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగా నాటి నుండి పనులు శరవేగంగా కొనసాగినాయి. నత్త నడకగా పనులు పూర్తి చేశారు. ఇటీవలే జూలై 29వ తేదీ శనివారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేతుల మీదుగా సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేశారు . సబ్ స్టేషన్ లో  ఆపరేటర్ మిషన్లో బిగించే అందుకు ఒక భవన  నిర్మాణం చేశారు. గుత్తేదారుడు పనులు నాసిరకంగా చేశారని క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే ఆనవాళ్లు కనిపించాయి.

ఆరు నెలల క్రితమే సబ్ స్టేషన్ ను ప్రారంభం కాకముందే విద్యుత్ శాఖకు గుప్తేదారుడు హ్యాండోవర్ చేశారు .ఇటీవలే జూలై మాసం 19వ తేదీ శనివారం నాడు జుక్కల్ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రారంభించారు. భవన నిర్మాణం పనులు నాసిరకంగా నిర్వహించారని అక్కడికి వచ్చిన వారు చూసి ఆ అక్కయ్యారు. ఇదేమి సబ్స్టేషన్ నిర్మాణం అని చలోక్తులు విసిరారు.వాష్ రూములో బకెట్లు లేక సౌకర్యాల కరువు , హడావుడిగా ప్రారంభోత్సవం వసతులు కల్పించకుండానే వదిలేశారు. భవనం పునాది క్రింది భాగంలో  చీలికలు వచ్చి సంధు ఏర్పడింది . మట్టితో కప్పి పుచ్చాల్సిన ప్రాంతమంతా వదిలేసి చిందరవందరంగా గుంతలతో గుంతల మయంగా మారింది. హడావిడి చేసి పనులను నాసిరకంగా చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. విద్యుత్ శాఖ కన్స్ట్రక్షన్ ఇంజనీరు అరవింద్ పర్యవేక్షణలో పనులను పూర్తి చేశారు.

నిర్మాణ పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో అధికారులు కమిషన్లకు లాలుచిపడి సదరు గుత్తి దారుడు  నాసిరకంగా పనిచేసిన పట్టించుకోకుండా ఉండిపోవడం ప్రజలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాల్సిన సబ్ స్టేషన్ ప్రస్తుతం ప్రారంభోత్సవ సమయంలోనే నాణ్యత లేకుండా పనితనాన్ని ప్రదర్శించాడు గుత్తేదారుడు. ఇప్పటికైనా సదరు  కాంట్రాక్టర్ తో కన్స్ట్రక్షన్ ఏఈ ఆదేశాలు చేసి పెండింగ్ పనులైన సబ్ స్టేషన్ పరిసర ప్రాంతం మట్టితో కప్పి వేసి గుంతలను పూడ్చీ వేసి భవన నిర్మాణం అడుగుభాగం లో ఏర్పడిన చీలికలను మూసి వేయించి పూడ్చివేయాలని మండల వాసులు కోరుతున్నారు. నాసిరకంగా పనులు చేసిన గుత్తేదరుడి పై మరియు  విద్యుత్ శాఖ కన్స్ట్రక్షన్ ఏఈ ని బాధ్యులుగా చేస్తూ శాఖవరం చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -